నడుం పట్టుకున్న మురారి.. కృష్ణకి కొంచెం ఇష్టం... కొంచెం కోపం!
on Mar 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -116 లో.. నందు దగ్గరికి వెళ్తుంది కృష్ణ. అక్కడికి వెళ్ళాక.. "సిద్దు మంచివాడు కాదు కృష్ణ" అని నందు అనగానే.. "లేదు నందు.. సిద్దు చాలా మంచోడు" అని కృష్ణ చెప్తుంది. నీకు సిద్దుని నేను చూపిస్తానని కృష్ణ అనగానే.. వద్దు బాబాయ్ లు చంపేస్తారని నందు అంటుంది. సిద్దుని చూపిస్తాను కానీ నువ్వు సిద్దుని చూసినట్లు ఇంట్లో ఎవరికి చెప్పొద్దని కృష్ణ చెప్పడంతో సరేనంటుంది నందు.
మరోవైపు కృష్ణ వాళ్ళ నాన్న ఫోటో దగ్గర మురారి నిలబడి.. గురువుగారు నేను కృష్ణకి సారీ చెప్తున్నాను అని అంటుండగా కృష్ణ వచ్చి.. జవాబు లేని దగ్గర మాట్లాడటం అనవసరమని అంటుంది. "నన్ను క్షమించు కృష్ణ.. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయంతో అలా మాట్లాడాను. నువ్వు ప్రతిసారీ గౌతమ్ సర్ గురించి నా ముందు అంటుంటే అసూయగా ఉండేది.. నేనొక ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించాను. సారీ కృష్ణ" అని అంటాడు మురారి. "ఉన్మాది లాగా కాదు.. అనుమానిలాగా ప్రవర్తించావ్. రెండు నెలలుగా నీతో ఒకే గదిలో ఉంటున్నాను.. నేను ఎలాంటిదాన్నో అర్ధంకాలేదా? అందరూ చెప్తున్నా నా చెయ్యి పట్టుకొని ఒక దోషిని చూసినట్టు చూసావ్. నాపై గౌరవం అప్పుడు కన్పించలేదా. ఇక చాలు" అని కృష్ణ వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు కృష్ణ పడిపోతుంటే.. తన నడుము పట్టుకొని కింద పడకుండా మురారి కాపాడతాడు. దాంతో కృష్ణ కోపంగా చూసి వెళ్ళిపోతుంది. మరోవైపు భవాని దగ్గరికి ముకుంద వెళ్ళి.. మీరు కృష్ణని వెళ్ళకుండా ఎందుకు ఆపారు అత్తయ్య అని అడుగుతుంది. కృష్ణ ఈ ఇంటి నుండి వెళ్ళడం నాకు ఇష్టం లేదు.. ఏదో క్రమశిక్షణలో పెట్టాలని అలా చేశాను.. నువ్వు ఎక్కువగా కృష్ణ గురించి అలోచించి నీ మనసుపాడు చేసుకోకని భవాని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత మురారి గులాబీ రేకులతో సారీ అని రాస్తాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. మళ్ళీ పడుకోవడానికి నందు రూమ్ లోకి వెళ్తుంటే.. ఎక్కడికి కృష్ణ.. నువ్వు ఇలా వెళ్తే అమ్మ ఏం అనుకుంటుందని మురారి అనగానే.. "అత్తయ్యకి నిజం తెలిసిన రోజు.. నేనే మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్తాను.. అత్తయ్య నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పగానే చాలా బాధపడింది.. ఆ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
